హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన

byసూర్య | Wed, Aug 17, 2022, 11:31 AM

రామంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మంగళవారం పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిధిగా 1974 బ్యాచ్ కు చెందిన విద్యార్థి నాయకుడు బ్రిగేడియర్ క్రిస్టఫర్ విచ్చేసి ప్రసంగించారు. ప్రతి వ్యక్తికి పాఠశాల జీవితం ఎంతో ముఖ్యమైందని ప్రతి చిన్న పని ఎంతో శ్రద్ధతో చేయాలని సూచించారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ డా. సల్లారం నరసింహారెడ్డి మాట్లాడుతూ. పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు విభాగం ప్రదర్శనలతోపాటు, తెలంగాణ ప్రభుత్వం ప్రాచ్య లిఖిత గ్రంధాలయం వారు ప్రదర్శించిన తాళపత్ర గంధాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ క్రిస్టఫర్, వేణు, వినోద్, డా. కె. రాము, అశ్విన్, కిరణ్, పంజ్వాణి, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM