నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

byసూర్య | Wed, Aug 17, 2022, 11:31 AM

చిలుకానగర్ 11కె. వి. ఫీడర్ పరిధిలో మరమ్మత్తులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఈనెల 17వ తేదీ బుధవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ఎం మధు రంజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పరిధిలోని గణేష్ నగర్, శ్రీనివాస హైట్స్, సెవెన్ హిల్స్ ప్రాంతాల్లో ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉప్పల్ పారిశ్రామికవాడలోని ఫెర్రో కాస్ట్ 11కె. వి. ఫీడర్ పరిధిలో మరమ్మత్తులు చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. ఫీడర్ పరిధిలోని ఉప్పల్ పారిశ్రామికవాడ ప్రాంతం, ఈ ఎస్ ఐ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు, పారిశ్రా మికవేత్తలు తమతో తమ సిబ్బందితో సహకరించాలని ఏఈ మధురంజన్ విజ్ఞప్తి చేశారు.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM