సొంత పార్టీ నేతలనే ప్రలోభాలకు గురిచేసే నీచమైన సంస్కృతికి తెరలేపింది

byసూర్య | Wed, Aug 17, 2022, 12:34 AM

సొంత పార్టీ నేతలనే ప్రలోభాలకు గురిచేసే నీచమైన సంస్కృతికి టీఆర్ఎస్ తెరలేపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇలా చేస్తేనే హుజూరాబాద్ ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారని.. అయినా మారడం లేదని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట రెడ్డి, మాజీ జడ్పీటీసీ, టీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అద్యక్షుడు కంది లక్ష్మా రెడ్డి.. ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


కేసీఆర్ పద్దతి పట్ల వెగటు పుట్టి.. ఆ పార్టీ నేతలు బయటికి వస్తున్నారని ఈటల రాజేందర్ వివరించారు. అలా వచ్చేవారిపై కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేస్తే.. ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. భయపెట్టి లొంగ దీసుకుంటాం అంటే.. తెలంగాణ సమాజం లోంగదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీనే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్నికల ముందో.. తరువాతనో కలిసిపోతాయని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఇంకో 6 నెలలు కష్టపడి పనిచేస్తే.. అధికారం బీజేపీ సొంతమని స్పష్టం చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM