రెండు రోజులగా నానో కార్ పార్కింగ్...బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్..టెన్షన్

byసూర్య | Wed, Aug 17, 2022, 12:32 AM

రెండు రోజులు బీజేపీ ఆఫీసు ముందు నానో కారు పార్కింగ్ చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళ్లితే.. హైదరాబాద్‌ నగరంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట నానో కారు కలకలం రేపింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు రెండ్రోజులుగా బీజేపీ ఆఫీసు ఎదుటే పార్క్ చేసి ఉంది. ఆ కారు పార్టీకి చెందిన వారిదయి ఉండొచ్చని కార్యకర్తలు, నేతలు భావిస్తూ వచ్చారు. అయితే ఎవరిని ఆరా తీసినా ఆ కారు తమది కాదని చెబుతుండటంతో బీజేపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చన్న అనుమానంతో మంగళవారం అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.


హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు కారును క్షుణ్ణంగా పరిశీలించారు. కారు లోపల సూట్‌కేసు ఉండటంతో దాన్ని బయటకు తీసి బాంబ్ స్వ్కాడ్స్‌తో తనిఖీ చేశారు. అందులో ఎలాంటి వస్తువులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ కారు ఎవరిది, ఇక్కడ ఎవరు పార్క్ చేశారు అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేయగా జువాద్ యర్ జంగ్ అనే వ్యక్తిదిగా తేలింది. దీంతో అతడికి ఫోన్ చేసి అక్కడికి రప్పించి ఆరా తీశారు. తన ఇంటి వద్ద కారు పార్కింగ్ లేకపోవడంతో ఇక్కడ పార్క్ చేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో కారుతో సహా యజమానిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.


పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని కొద్దిరోజుల క్రితమే కేంద్ర నిఘా వర్గాలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆఫీసు వద్ద అనుమానాస్పదంగా కారు పార్క్ చేసి ఉండటం కలకలం రేపుతోంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM