ముఖ్య అనుచరుడి పాడే మోసిన తుమ్మల నాగేశ్వరరావు

byసూర్య | Wed, Aug 17, 2022, 12:33 AM

తన  ముఖ్య అనుచరుడి పాడేను మోసారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి కన్నీటి సంద్రంగా మారింది. హత్యకు గురైన టీఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య అంతిమయాత్రలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తమ్మినేని కృష్ణయ్య పాడె మోశారు. తన అనుచరుడికి తుది వీడ్కోలు పలుకుతూ.. కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్ర కొనసాగిన దారి పొడవునా.. అభిమానులు నినాదాలు చేశారు. అంతిమయాత్ర సందర్భంగా.. పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం తెల్దారుపల్లి. తమ్మినేని వీరభద్రం బాబాయి కుమారుడు తమ్మినేని కృష్ణయ్య హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సీపీఎం పార్టీకి కంచుకోటగా ఈ గ్రామం ఉంది. సీపీఎంలో కీలక నాయకుడిగా కృష్ణయ్య వెలుగొందారు. గతంలో ఆయన టేకులపల్లి ఆంధ్రా బ్యాంక్ సహకార సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడేళ్ల కిందట సర్పంచ్ ఎన్నికల సమయంలో తమ్మినేని కృష్ణయ్య.. సీపీఎంతో విభేదించి నామినేషన వేసి ఉపసంహరించుకున్నారు.


నాటి నుంచి గ్రామంలో పరిస్థితులు మారాయి. ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో తమ్మినేని కృష్ణయ్య తన భార్యను స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిపి ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత సహకార సంఘం ఎన్నికల్లో స్వతంత్రంగా బరిలో నిలిచిన ఆయన.. తనతోపాటు మరో ఇద్దరిని గెలిపించుకోవడంతో సీపీఎం ఆధిపత్యానికి బ్రేకులు పడినట్లైంది. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో.. తమ్మినేని కృష్ణయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీమంత్రి తుమ్మల అనుచరుడిగా కొనసాగుతున్నారు. దీంతో సీపీఎంకు కంచుకోటగా ఉన్న తమ్మినేని వీరభద్రం గ్రామంలో టీఆర్‌ఎస్ బలం పుంజుకుంది. నాటి నుంచి సీపీఎం, టీఆర్‌ఎస్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.


తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కృష్ణయ్య పలుసార్లు ఖమ్మం పోలీస్ కమిషనర్‌ సహా.. ఇతర పోలీసు అధికారులను కలిసి చెప్పినట్లు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా కృష్ణయ్యను జాగ్రత్తగా ఉండాలని పలుమార్లు చెప్పినట్లు సమాచారం. కృష్ణయ్యను ప్రత్యర్థులు హత్య చేసేందుకు పలుసార్లు రెక్కీ నిర్వహించి విఫలమైనట్టు తెలుస్తోంది. తాజాగా.. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. అనుచరిడితో కలిసి తిరిగొస్తున్న కృష్ణయ్యను దుండగులు మాటువేసి కిరాతకంగా నరికి చంపారు.


2001 తర్వాత గ్రామంలో మరోసారి అలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొందని తెల్దారుపల్లివాసులు చెబుతున్నారు. నాడు వేగినాటి వెంకటయ్య అనే వ్యక్తి.. సీపీఎంను వీడి టీపీపీలో చేరి.. తెలుగుదేశం జెండా దిమ్మెను నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యారు. అప్పుడు ప్రత్యర్థులు ఆయన కాళ్లు నరికి కిరాతకంగా హత్య చేశారు. సంచలనం రేపిన ఈ హత్య తర్వాత గ్రామంలో సీపీఎంకు వ్యతిరేకంగా ఇతర పార్టీ జెండా ఎగురవేయాలన్నా.. ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటీ చేయాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని గ్రామస్థులు చెబుతున్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాత జరిగిన హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM