పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం

byసూర్య | Wed, Aug 10, 2022, 09:31 PM

సినిమాల్లోని కొన్ని సీన్లు నిజజీవితంలో సాధ్యంకావు అన్నది మనం భావిస్తుంటాం. కానీ అవి సాధ్యమేనని ఇటీవల జరుగుతన్న ఘటనలు స్పష్టంచేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ పెళ్లి.. సినిమా సీన్ తలపించింది. తాళి కట్టే సమయంలో ఓ యువతి ఎంట్రీ ఇచ్చి ఆ పెళ్లి వేడుకను నిలిపివేయించింది. పెళ్లి వేడకకు వచ్చిన అతిథులందరూ ఈ పరిణామంతో విస్తుపోయారు. వరుడు రాజేష్ తనను ప్రేమించి, తనకు తెలియకుండా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. తననే పెళ్లి చేసుకోవాలని అక్కడే అందోళనకు దిగింది. ఆ గొడవంతా చూసి.. వధువు, ఆమె బంధువులు పెళ్లి కొడుకును తిట్టుకుంటూ అక్కడ నుంచి సైడయ్యారు. దీంతో పెళ్లి నిలిచిపోయింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి, మరో పెళ్లి చేసుకుంటున్నాడని మండిపడ్డ యువతి.. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో వధువు భావోద్వేగానికి గురైంది. తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. వరుడు రాజేష్ తీరుపై పెళ్లి కుమార్తె బంధువులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకొని, ఆడపిల్లలా గదిలో ఎందుకు దాక్కున్నావ్?’ అంటూ ఓ మహిళ మండిపడ్డారు. మరే ఇతర అమ్మాయి జీవితంతో ఆడుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


Latest News
 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోపాల్ Sun, Sep 24, 2023, 03:01 PM
గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Sun, Sep 24, 2023, 02:44 PM
జమ్మికుంట బస్టాండ్ లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం Sun, Sep 24, 2023, 01:49 PM
చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం Sun, Sep 24, 2023, 12:49 PM
వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు Sun, Sep 24, 2023, 12:37 PM