ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా

byసూర్య | Wed, Aug 10, 2022, 09:32 PM

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా... టీఆర్ఎస్ దే విజయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితా ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పిన ఆయన బీజేపీలో చేరబోతున్నారు. కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా... టీఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా... అభివృద్ధి ఆగలేదని చెప్పారు. 


బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తుందని కవిత విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారని చెప్పారు. దేశ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ లో వన మహోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.


Latest News
 

మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు Sat, Jan 28, 2023, 11:15 AM
బైక్ నెంబర్ ప్లేట్ తీశారా... కోర్టు మెట్లు ఎక్కవలసిందే: రాచకొండ ట్రాఫిక్ డీసీపీ Sat, Jan 28, 2023, 11:11 AM
ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ Sat, Jan 28, 2023, 11:09 AM
నేడు ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి Sat, Jan 28, 2023, 11:00 AM
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు Sat, Jan 28, 2023, 10:57 AM