ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య

byసూర్య | Wed, Aug 10, 2022, 09:31 PM

యువతి, యువకుడు కలిస్తే చాలు ఎవరైనా వారు ప్రేమికులేనని ముద్రవేస్తుంటారు. కానీ ఆ ముద్ర కొందరి జీవితాల్లో విషాదం కూడా నింపుతుందన్నది మనం గ్రహించాలి. వాస్తవాలు గ్రహించకుండా నిందలు మోపరాదు. నిజామాబాద్ జిల్లాలో ఓ యువ జంట గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ సమీపంలో నందిపేటకు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు, మరో యువతి కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువకుడు వినయ్ మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


వీరిద్దరూ ఆత్మహత్యకు యత్నించే ముందు సూసైడ్ నోట్ రాశారు. తాము అన్నాచెల్లెళ్లలా మెలిగితే.. ప్రేమికులంటూ తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం.. మేం అన్నా చెల్లెళ్లమే. మేం ఎవరినైనా నొప్పిస్తే.. క్షమించండి. చేయని తప్పును ఒప్పుకోలేక మేం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ Sun, Oct 02, 2022, 06:15 PM