నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి

byసూర్య | Wed, Aug 10, 2022, 09:30 PM

సోషల్ మీడియాలో మునుగోడు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫు ఓ ఆడియో చక్కర్లు కోడుతోంది. తనకు సంబంధించిన ఆ అడియో పై కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి, ఓ కార్యకర్త మధ్య సెల్‌ఫోన్ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మరో అభ్యర్థి చల్లమల్ల కృష్ణారెడ్డికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు ఓ కార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే కృష్ణారెడ్డికి టిక్కెట్‌ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజూరాబాద్‌లో వచ్చిన ఫలితాలే ఇక్కడా వస్తాయని స్రవంతి అన్నట్లుగా సంభాషణ సాగింది.


ఈ ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆ ఆడియోలో తాను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తనపై కక్షతో కొందరు కావాలనే ఆ ఆడియో క్లిప్‌ను సోషల్‌మీడియాలో వైరల్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చల్లమల్ల కృష్ణా రెడ్డి నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అని.. అతనికి టికెట్‌ ఇస్తే ఓట్లు పడవని మాత్రమే చెప్పినట్లు స్పష్టం చేశారు.


Latest News
 

టీఆర్ఎస్ పార్టీ నేతలతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం Sun, Oct 02, 2022, 09:10 PM
అప్పుడు నేను గాంధీనే గుర్తు చేసుకునేవాడిని... సీఎం కేసీఆర్ Sun, Oct 02, 2022, 06:19 PM
గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్... నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంస Sun, Oct 02, 2022, 06:18 PM
దసరా రోజున టిఆర్ఎస్ ఎల్పి సమావేశం... అదే రోజు జాతీయ పార్టీ ప్రకటన Sun, Oct 02, 2022, 06:17 PM
ప్రభుత్వ వైఖరికి నిరసనగా బ్లేడుతో గొంతు కోసుకున్న విఆర్ఏ Sun, Oct 02, 2022, 06:15 PM