వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం

byసూర్య | Wed, Aug 10, 2022, 09:29 PM

వరంగల్ ‌జిల్లాలో రాజకీయం వాడివేడిగా సాగుతున్నాయి. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌‌తో విభేదాల కారణంగా మంత్రి సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్ఎస్‌కి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే నరేందర్ తనను అడుగడుగునా అవమానిస్తున్నారని.. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ప్రదీప్‌రావు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.


ఈ క్రమంలోనే ఎమ్మెల్యే నరేందర్‌కు సవాల్‌ విసురుతూ వరంగల్‌ అండర్‌బ్రిడ్జి, రైల్వే, కాశీబుగ్గ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ఆగస్టు 10వ తేదీలోగా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని, ఓరుగల్లు బిడ్డవైతే తన సవాల్ స్వీకరించాలని ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలను కోట్ చేస్తూ కొందరు వ్యక్తులు వరంగల్‌ నగరంలో పోస్టర్లు అతికించారు. వరంగల్ రాజకీయాల్లో ఈ పోస్టర్లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ పోస్టర్లను ప్రదీప్ వర్గమే అతికించిందా? లేక గొడవలు సృష్టించేందుకు ఇంకెవరైనా అతికించారా? అన్న చర్చనీయాంశమైంది.


Latest News
 

నిర్మల్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో హత్య! Sat, Dec 13, 2025, 12:55 PM
రఘునాథపాలెం మండలంలో బీఆర్ఎస్ ఘనవిజయం.. ప్రజాబలమే కీలకమని నాయకులు Sat, Dec 13, 2025, 12:35 PM
కవ్వాల్ సర్పంచ్ గా సక్రు నాయక్ విజయం, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అభినందన Sat, Dec 13, 2025, 12:10 PM
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. చివరికి? Sat, Dec 13, 2025, 12:03 PM
TGCET-2026: గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ Sat, Dec 13, 2025, 12:01 PM