అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బాయ్ కాట్ చేశారు: మంత్రి కేటీఆర్

byసూర్య | Mon, Aug 08, 2022, 05:22 PM

నీతి ఆయోగ్ సమావేశానికి తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు బహిష్కరించారోనన్న కారణాలపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు స్పందించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే అని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


కేసీఆర్ భేటీకి వెళ్లి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ‘సంధి కుదరదని తెలిసి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన మహాభారతం నుండి కేసీఆర్ స్ఫూర్తి పొందాల్సింది.  ప్రధానమంత్రి, సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలోనే నీతి ఆయోగ్‌ని సీఎం ప్రశ్నించాల్సి ఉంది’ అని నాగేశ్వర్ ట్వీట్ చేశారు.


దీనికి మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘అయినను పోయి రావలె హస్తినకు” అనేది పాత సామెత నాగేశ్వర్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్టదాఖలు చేసింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే’ అని ట్వీట్ చేశారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బాయ్ కాట్ చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM