దాసోజు శ్రవణ్ సొంత గూటికి రావాలి: బండి సంజయ్

byసూర్య | Sat, Aug 06, 2022, 04:14 AM

దాసోజు శ్రవణ్ సొంత గూటికి రావాలని కోరుకొంటున్నానని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కోమటిరెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనుండగా, దాసోజు శ్రవణ్ కూడా బీజేపీలోకి రావాలంటూ బండి సంజయ్ ఆహ్వానం పలికారు. దాసోజు శ్రవణ్ జాతీయ భావాలున్న వ్యక్తి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గా వ్యవహరించారని వెల్లడించారు. దురదృష్టం ఏమిటంటే, ఆనాడు కేసీఆర్ కు శ్రవణ్ చాలా మంచివాడిలా కనిపించారని, కానీ ప్రజల్లో శ్రవణ్ కు ఆదరణ లభిస్తుంటే భరించలేక ఆయనను అణగదొక్కారని బండి సంజయ్ విమర్శించారు. దాసోజు శ్రవణ్ గతంలో ఏబీవీపీ తరఫున పలు ఉద్యమాల్లో పాల్గొన్నారని, ఆయన తన సొంత గూటికి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM