నార్మల్ డెలివరీలు చేస్తే..డాక్టర్లకు రూ.3వేల ప్రోత్సాహం

byసూర్య | Sat, Aug 06, 2022, 03:35 AM

పథకాల విషయంలో తనదైన ముద్రవేసుకొంటూ ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టింది. తల్లి కావడం మహిళ జీవితంలో ఓ అపురూప ఘట్టం. ఆ మధుర క్షణాల కోసం పురిటినొప్పులను కూడా ఆనందంగా భరిస్తారు. కొన్నేళ్ల కిందటి వరకు నార్మల్ డెలివరీల ద్వారానే ఎక్కువగా పిల్లల్ని కనేవారు. అయితే, ఆధునిక కాలంలో సహజ ప్రసవాల  కంటే సిజేరియన్ ద్వారానే డెలివరీలు ఎక్కువగా అవుతున్నాయి. ప్రైవేట్ వైద్యులు కాసుల కోసమే సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాస్తో కూస్తో జరిగే ఆ నార్మల్ డెలివరీలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నమోదవుతున్నాయి. వీటిని మరింత ప్రోత్సహించే చర్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసే డాక్టర్లకు రూ.3 వేల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. దీనిపై వైద్యులు, మహిళలతో పాటు వివిధ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.


ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాలింతలకు శిశువుకు అవసమైన వస్తూత్పత్తులతో కూడిన కిట్‌తో పాటు రూ.13000 నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి. తాజాగా ఈ దిశగా డాక్టర్లకు ప్రోత్సాహం ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారనుంది.


Latest News
 

కవితా గో బ్యాక్ గో బ్యాక్...రంగారెడ్డి కోర్టులో నిరసనలు Wed, Sep 28, 2022, 08:44 PM
దుర్గం చెరువులో దూకి మహిళా ఆత్మహత్య Wed, Sep 28, 2022, 08:43 PM
ఈత సరదా...ఆ ముగ్గిరి ప్రాణాలను హరించింది Wed, Sep 28, 2022, 08:42 PM
తెలంగాణ మిర్చికి దక్కిన అరుదైన గౌరవం Wed, Sep 28, 2022, 08:41 PM
నగరాన్ని చుట్టేసి రావాలని ఉందా...అయితే మీ కోసమే హైదరాబాద్ దర్శన్ ప్యాకేజీ Wed, Sep 28, 2022, 08:40 PM