ఆ వ్యాపారంలో తప్పేముంది: చీకోటి ప్రవీణ్

byసూర్య | Fri, Aug 05, 2022, 10:37 PM

క్యాసినో కేసులు విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాసినో ఆడించేందుకు ప్ర‌ముఖుల‌ను విదేశాల‌కు త‌ర‌లిస్తూ అక్ర‌మ లావాదేవీలు సాగిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు విచారిస్తున్న చీకోటి ప్ర‌వీణ్ శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం వ‌రుస‌గా నాలుగో రోజు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. క్యాసినో బిజినెస్ చేస్తాన‌ని చెప్పిన ప్ర‌వీణ్‌... అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు రాజ‌కీయ‌, సినీ రంగాల‌కు చెందిన చాలా మంది ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని కూడా ప్ర‌వీణ్ తెలిపారు. కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. విచార‌ణ‌లో భాగంగా ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తున్నాన‌ని తెలిపారు. ఈడీ విచార‌ణ ముగిసిన త‌ర్వాత మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని ప్రవీణ్ తెలిపారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM