నేను అలా అనలేదు..మీరు అలా రాయోద్దు: బండి సంజయ్

byసూర్య | Fri, Aug 05, 2022, 10:35 PM

మీడియాను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమతో టచ్ లో ఉన్నారని తాను అనలేదని ఆయన అన్నారు. తాను అనని మాటను అన్నట్టుగా బ్రేకింగులు పెట్టి వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నానని చెప్పారు. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి మోదీ అని అన్నారు. అభివృద్ధికి సంబంధించిన నిధుల కోసం మోదీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తుంటారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీదే విజయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM