మునుగోడు ఎన్నికల వేళ..కాంగ్రెస్ కు షాక్ లపై షాక్ లు

byసూర్య | Fri, Aug 05, 2022, 10:37 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ లపై  షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి శుక్ర‌వారం మ‌రో షాక్ త‌గిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌ది మంది జీవితాల్లో వెలుగులు నింపాల‌న్న ఉద్దేశ్యంతోనే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు. తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌కంగా ప‌నిచేశాన‌ని తెలిపారు. కాంగ్రెస్‌లో త‌న‌కు అంచెలంచెలుగా ఎదిగే అవ‌కాశాన్ని ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. రాజ‌కీయం అంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మ‌నే తాను న‌మ్ముతాన‌ని ఆయ‌న తెలిపారు. ఆ న‌మ్మ‌కంతోనే కాంగ్రెస్‌లో ప‌నిచేసుకుంటూ వ‌చ్చాన‌ని అన్నారు.  


టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్టీలో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయ‌ని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని భ్రష్టు ప‌ట్టించార‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని అన్నారు. రేవంత్ త‌ప్పు చేస్తే అడిగే వారే లేర‌న్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఎన్నో నిద్రలేని రాత్రులు గ‌డిపాన‌న్నారు. స‌ర్వేల పేరుతో త‌ప్పుడు నివేదిక‌లు ఇచ్చి మోసం చేస్తున్నార‌న్నారు. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్కం ఠాగూర్‌లు కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. 


ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా చేయ‌నున్న‌ట్లుగా వార్త‌లు వినిపించిన వెంట‌నే ఆయ‌నను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మంలో శ్ర‌వ‌ణ్ ఇంటికి పార్టీ సీనియ‌ర్లు కోదండ‌రెడ్డి, మ‌హేశ్ గౌడ్‌ల‌తో కూడిన ప్ర‌తినిధి బృందాన్ని పంపింది. అయితే వీరి బుజ్జ‌గింపుల‌కు శ్ర‌వ‌ణ్ మెత్త‌బ‌డ‌లేదు. కోదండ రెడ్డి బృందం త‌న ఇంటి నుంచి వెళ్లిపోగానే... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు శ్ర‌వ‌ణ్ ప్ర‌క‌టించారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM