నీరు సాఫీగా పోవాలంటే డ్రైనేజీలో చెత్తచెదారం వేయకండి

byసూర్య | Fri, Aug 05, 2022, 02:09 PM

ఎడతెరిపిలేకుండ కుండపోతగా గత రెండు రోజులు మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షంతో శివనగర్ లోని రహదారులు జలమయమైనాయి. దీంతో డ్రైనేజీలు కాలువలు పొంగి పొర్లుతూ రోడ్లపై నీరు చేరింది. 34వ డివిజన్ కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి ఆదేశంతో మున్సిపల్ జవాన్ జి. కుమారస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులు శ్రమించి డ్రైనేజీలో చేరిన చెత్తచెదారాన్ని వెంటనే తొలగిస్తూ నీరు సాఫీగా సాగేందుకు శ్రమించారు. ప్రతినిత్యం డివిజన్ ప్ర జలకు కాలువల్లో చెత్తచెదారం, ప్లాస్టిక్ బాటిల్స్ వేయొద్దని జవాన్, సిబ్బది సూచిస్తున్నా.


నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అలాగే వేస్తుండటంతో జవాన్, కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు సాఫీగా పోవాలంటే డ్రైనేజీలో చెత్తచెదారం వేయకుండా నిర్దేశించిన డస్ట్ బిన్లల్లో వేయాలని సూచించారు. సిబ్బంది శ్రమిస్తున్నడంతో నీరు సాఫీగా కొనసాగుతోంది. దీంతో కార్పోరేటర్ కుమారస్వామి వారి పనితీరును చూసి అభినందించారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM