గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

byసూర్య | Fri, Aug 05, 2022, 02:00 PM

జైపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం పుడ్ పాయిజన్ కావడంతో 16 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం స్నాక్స్ గా ఇచ్చిన బిస్కెట్లు తిన్న విద్యార్థులు కాసేపటికి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి రావడంతో 16 మంది విద్యార్థులను 108 వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడగా చికిత్స అందిస్తున్నారు. మరికొందరు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురి కాగా స్థానికంగానే వైద్యం అందించారు. వసతి గృహాల్లో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.


Latest News
 

ఉప ఎన్నికలు ఎప్పుడూ జరిగిన విజయం మాదే: కవితా Wed, Aug 10, 2022, 09:32 PM
పెళ్లి కొడుకుపై అటు ప్రియురాలు..ఇటు పెళ్లి కూతురు బంధువుల ఆగ్రహం Wed, Aug 10, 2022, 09:31 PM
ప్రేమికులుగా ముద్రవేశారని...మన స్థాపంతో యువతి, యువకుడి ఆత్మహత్య Wed, Aug 10, 2022, 09:31 PM
నేను ఎవరిని తప్పుపట్టేలా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి రెడ్డి Wed, Aug 10, 2022, 09:30 PM
వరంగల్ లో పోస్టర్ వార్...ఆ రెండు నేతల మధ్య వివాదానికి మరింత ఆజ్యం Wed, Aug 10, 2022, 09:29 PM