పెళ్లి బృందంతో వెళ్తున్న కారులో మంటలు

byసూర్య | Fri, Aug 05, 2022, 01:58 PM

పెళ్లి బృందంతో వెళ్తున్న కారులో మంటలు చెలరేగగా అందులో ఉన్న వారు అప్రమత్తమై కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన మందమర్రి మండలంలోని జాతీయ రహదారిపై మేడారం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. కాగజ్ నగర్ కు చెందిన రాజేష్ పెళ్లి శుక్రవారం ఉదయం హైదరాబాద్ లో ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆల్టో కారులో వెళ్తున్నారు.


మందమర్రి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. గమనించి కారులో ఉన్న నలుగురు కిందికి దిగి ఫైరింజన్ కు సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మండలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పెళ్లి సామగ్రి కాలిపోయింది. ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో...హైదరాబాదీల మరణం Mon, Aug 15, 2022, 11:12 PM
పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులపై బీహార్ లో నింధితుల కాల్పులు Mon, Aug 15, 2022, 10:02 PM
నూపూర్ శర్మ వ్యాఖ్యలను రిపీట్ చేసిన రాజా సింగ్ Mon, Aug 15, 2022, 10:01 PM
భార్యపై అలిగి లైవ్ లో ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి Mon, Aug 15, 2022, 09:48 PM
మాపై దాడులు జరుగుతుంటే పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాట్లు...డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ Mon, Aug 15, 2022, 09:30 PM