ఆ రాష్ట్రాలకు వరాలిచ్చిన మోడీ..మా తెలంగాణకు ఏమి ఇవ్వరెందుకు: హరీష్ రావు

byసూర్య | Mon, Jul 04, 2022, 12:10 AM

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమీ ఇవ్వరు ఎందుకు అని టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు ప్రధాని మోదీ మరోసారి మొండి చేయి ఇచ్చారని ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించామన్నారు. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా.. అసలు తమకు జవాబుదారీతనమే లేదని నిరూపించారన్నారు.


గుజరాత్‌కు వరాలిస్తారు.. క్రూడాయిల్ రాయల్టీ రూ.763 కోట్లు ఇచ్చారన్న హరీశ్ రావు.. ‘‘రాజ్‌కోట్‌కు ఎయిమ్స్ ఇస్తారు.. బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు.. ఆయుర్వేదిక్ యూనివర్సిటీకి జాతీయ హోదా ఇస్తారు.. ట్రెడిషనల్ మెడిసిన్‌కు సంబంధించి గ్లోబల్ సెంటర్ మంజూరు చేశారు.. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చారు.. ఇంకా ఎన్నో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు మిషన్ యూపీకి రూ.55,563 కోట్లు ఇచ్చారు. 9 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇచ్చారు. కర్ణాటకకు తూముకూర్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ, ముంబయి-బెంగళూరు ఎకనమిక్ కారిడార్, మైసూర్ టెక్స్‌టైల్ మెగా క్లస్టర్... ఇంకా ఎన్నో ఇచ్చారు. మరి తెలంగాణకు కూడా ఇట్లానే ఏమైనా ఇస్తారేమో అనుకున్నాం. కానీ, మొండి చెయ్యి ఇచ్చారు. ఒక్కటి కూడా ప్రజలకు పనికొచ్చే ప్రకటన చేయలేదు’ అని హరీశ్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ప్రసంగం విషయమై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని చెప్పిన 5 నీటి ప్రాజెక్టులేవో చెబితే బాగుంటుందన్న ఆయన.. ప్రధాని నోట అబద్దాలు రావడం బాధాకరమన్నారు.


Latest News
 

తెలంగాణ రెయిన్ అలెర్ట్ Mon, Aug 08, 2022, 09:35 PM
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ Mon, Aug 08, 2022, 09:23 PM
తెలంగాణ కరోనా అప్డేట్ Mon, Aug 08, 2022, 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ Mon, Aug 08, 2022, 09:04 PM
విజృంభిస్తున్న కరోనా.. జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు Mon, Aug 08, 2022, 05:31 PM