ఒక రాత్రి వర్షానికే వణికిన మహానగరం...రెడ్ అలర్ట్ జారీ చేసిన జీహెచ్ఎంసీ

byసూర్య | Tue, Jun 21, 2022, 02:18 PM

వర్షాలు లేక విలవిలలాడిన మహాానగరం హైదరాబాద్ సోమవారం రాత్రి కురిసిన వర్షానికి గజగజవణికింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలోని ఉన్నాయి.


హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఉప్పల్, తర్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకపూల్, మూసాపేట, ఎర్రగడ్డ, పటాన్ చెరు, ఆర్సీపురం, మణికొండ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మాదాపూర్‌లో 67.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.


దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే ఉండిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో నగరవాసులు అనవసరంగా బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అంతేగాక, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసరమైతే 040-21 111 111 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని కోరింది.


సంగారెడ్డి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి వర్షం దంచికొట్టింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలోనూ భారీ వర్షం పడింది. తెలంగాణలో ఇతర జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలో సోమ, మంగళవారాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని తెలిపింది.


 


Latest News
 

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు Tue, Jul 05, 2022, 12:13 PM
కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవం హాజరైన ప్రజాప్రతినిధులు Tue, Jul 05, 2022, 12:12 PM
కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ Tue, Jul 05, 2022, 12:07 PM
క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ Tue, Jul 05, 2022, 12:03 PM
ఇంటికో ఉద్యోగం బోగస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే Tue, Jul 05, 2022, 11:53 AM