దళితుల సాధికారతే లక్ష్యం: ఎల్బీనగర్ ఎమ్మెల్యే

byసూర్య | Tue, Jun 21, 2022, 09:34 AM

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చారిత్రక నిర్ణయం అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దళితబంధు ద్వారా నియోజకవర్గంలో మంజూరైన 10 కార్లను ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ తో కలిసి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ. దళితుల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాందించిన ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సాయం అందజేస్తామన్నారు. దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందేందుకు వివిధ రకాల యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరైన నిధుల్లో 10 వేలతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామని. దురదృష్టవశాత్తు లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఈనిధి ఒక ఇన్సూరెన్స్ లు ఉపయో గపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాల రాహుల్ గౌడ్, శ్వేతారెడ్డి, ఉదయ్, ఇటికల యాదగిరి, యాసిన్, నగేష్, ఎస్సీ కార్పొరే షన్ అధికార ప్రతినిధి ప్రవీణ్ పాల్గొన్నారు.

Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM