కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, May 25, 2022, 05:03 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ అమ్ముతోంది. కార్మికులను బీజేపీ రోడ్డున పడేస్తోంది. కేంద్ర మంత్రులు వచ్చిపోవడమే తప్ప ఇస్తున్నది ఏమీ లేదు, మేకిన్ ఇండియా పథకం అంతా బక్వాస్, బిజెపి సర్కార్ విధానాలతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతోంది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది.


నిధుల కోసం రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని నిలదీయాలి, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తటం లేదు, కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని నిలదీయాలి, కేంద్రం అనేక అవార్డులు తెలంగాణకి ఇస్తుంది. అవార్డులు, ప్రశంసలే తప్ప ఒక్క ప్రాజెక్ట్ కేటాయించిన పాపాన పోలేదు, కేంద్రం లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఉన్న సంస్థలు మూత పడుతున్నాయి. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారు. నష్టాల్లో ఉన్న వాటిని పట్టించుకోవడం లేదు. హెచ్ఎంటీ సంస్థను ఇప్పటికే నిర్వీర్యం చేశారు. ఉద్యోగులు పదవీ విరమణ పొంది ఐదేళ్లు గడుస్తున్నా ఒక్కరూపాయి చెల్లించలేదు. కేంద్రం బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ సంస్థలను బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రం స్వశక్తితో ఎదుగుతోంది. 2 లక్షల 45 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి, లక్షల ఉద్యోగాలు సాధించి దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ, మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనతో తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం సొంతకాళ్లపై ఎదుగుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM