ధరలు పెరిగినా...మందు బాబుల జోరు తగ్గలేదు

byసూర్య | Wed, May 25, 2022, 09:17 PM

ధర ఎంతైనా  మందుబాబు మాత్రం వాటిని పట్టించుకోరు. ఎంతసేపు మందు  ఫుల్ గా కొట్టడంపైనే ప్రధాన ఆలోచన. తాజాగా తెలంగాణలో మద్యం ధరలు విపరీతంగా పెరిగాయి. అయినా  మద్యం అమ్మకాలపై వాటి ప్రభావం ఏ మాత్రం పడలేదని తెలుస్తోంది. తెలంగాణలో మద్యం ధరలు అమాంతం పెరిగినప్పటికీ ఏమాత్రం తగ్గేదేలేదంటున్నారు మందుబాబులు. గత నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 523 కోట్ల మద్యాన్ని ఊదిపడేశారు. ప్రభుత్వం ఇటీవల చీప్ లిక్కర్‌పై రూ. 25, బీర్ బాటిల్‌పై రూ. 10 చొప్పున పెంచింది. పెంచిన ధరలు ఈ నెల 19 నుంచే అమల్లోకి వచ్చాయి. అంతేకాదు, అప్పటి వరకు ఉన్న పాత స్టాక్‌కు లెక్కగట్టి మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ డ్యూటీని వసూలు చేశారు. ఆ రోజు సాయంత్రం వరకు లెక్కింపు జరగడంతో పెద్దగా అమ్మకాలు జరగలేదు. ఆ రోజు రూ. 75 కోట్ల మద్యం మాత్రమే అమ్ముడైంది.


అయితే, ఆ తర్వాతి రోజు నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. 20న రూ. 145.3 కోట్లు, 21న రూ. 149.5 కోట్లు, 22న రూ. 153.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఫలితంగా నాలుగు రోజుల్లో మొత్తంగా రూ. 523 కోట్ల మద్యం అమ్ముడైంది. వీటిలో 8.31 లక్షల కేసుల బీర్లు, 4.88 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగాయి. ధరల పెంపు తర్వాత రోజుకు సగటున రూ. 130 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి విక్రయాలు 36.27 శాతం పెరగడం గమనార్హం.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM