మితిమీరుతున్న పోకిరీల ఆగడాలు..విఫలమవుతున్న నిఘా

byసూర్య | Mon, May 23, 2022, 08:21 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం మహానగరంలో పోకిరీల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో నగరంలోని పోలీసుల నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాదులో కొందరు పోకిరీలు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ ఇతరులకు అంతులేని ఆవేదనను కలిగిస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారిన వీరు... మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిన్న రాత్రి ఇలాంటి ఘటనే మరొకటి నగరంలో చోటుచేసుకుంది.


చైతన్యపురిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న భార్యాభర్తలను వేధింపులకు గురి చేశారు. వివరాల్లోకి వెళ్తే, నిన్న రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న వీరిని చైతన్యపురి రోడ్డుపై పోకిరీలు ఆపేశారు. మహిళను వేధించారు.   ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించాడు. దీంతో అతనిపై పోకిరీలు ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM