తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,400 మంది పోలీసులకు కరోనా

byసూర్య | Tue, Jan 18, 2022, 09:49 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,400 మంది పోలీసులకు కరోనా సోకోయింది. దీనితో పోలీస్ శాఖ లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం శాంతి భద్రతలు, ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులను కరోనా కలవరపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,400 మంది పోలీసు అధికారులకు కరోనా రాకతో శాఖ అప్రమత్తమైంది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పోలీసులలో రోజురోజుకు పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 500 మందికి పైగా పోలీసులను కరోనా బారినపడ్డారు. సైబరాబాద్ పరిధిలో 150 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 110 మంది పోలీసులకు వైరస్ సోకినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు సీరియస్ నేరాల విషయంలో తప్ప బాధితులు కంప్లయింట్ చేసేందుకు పీఎస్ కు రాకూడదని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. బదులుగా ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు. నిర్దిష్ట పీఎస్‌ల పరిధిలో కంప్లైంట్ ఫైళ్లను ఫైల్ చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టే వరకు పోలీసు అధికారులు తమ సూచనలను పాటించాలన్నారు.


Latest News
 

విద్యుత్ షాక్ తో ఆవు దూడ మృతి Mon, May 06, 2024, 03:58 PM
కేశవపట్నంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 03:54 PM
బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు Mon, May 06, 2024, 03:52 PM
ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Mon, May 06, 2024, 03:51 PM
దళిత బంధు పేరుతో బిఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకున్నారు Mon, May 06, 2024, 03:44 PM