బిజెపిలో తారా స్థాయికి కుమ్ములాటలు: పొన్నం ప్రభాకర్
 

by Suryaa Desk |

బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరుకున్నాయని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీలో ఐకమత్యం లేదని ఆయన అన్నారు. తెలంగాణ బీజేపీలో అసంతృప్త కుమ్ములాటలు మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత ముదురుతాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కరీంనగర్ బీజేపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారని. ఈ సమావేశంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం సంజయ్ కు ఇష్టం లేదని అన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటున్నారని... ఏ ప్రాతిపదికన కేసీఆర్ ను జైలుకు పంపిస్తారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు.


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM