ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఘోర ఓటమి తప్పదు:ఇంద్రకరణ్ రెడ్డి
 

by Suryaa Desk |

త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి పరాభవం తప్పదని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని  విమర్శించారు. దేశ వ్యాప్తంగా బీజేపీ పతనానికి కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, ఇతర పార్టీల్లో చేరుతున్నారని అన్నారు. ఎరువుల ధరల పెంపు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపు వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు నాగళ్లు ఎత్తాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక బీజేపీ విధానాలపై నిర్మల్ లో ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.


Latest News
ఉస్మానియాలో క్రికెట్ టోర్నమెంట్ ఏ ముఖం పెట్టుకొని పెట్టారు ..? Sat, Jan 29, 2022, 03:31 PM
అమీర్ పేటలోని ఆ ఫ్యాషన్ మాల్ సీజ్ Sat, Jan 29, 2022, 02:56 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం:మంత్రి తలసాని Sat, Jan 29, 2022, 02:26 PM
ఆ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు... ! Sat, Jan 29, 2022, 01:55 PM
వరద సాయం తెలంగాణాకి ఇవ్వని బీజేపీ Sat, Jan 29, 2022, 01:37 PM