కరీంనగర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
 

by Suryaa Desk |

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి భారీ హోర్డింగ్‌లు కూలిపోయాయి. ఫిబ్రవరిలో ప్రారంభించిన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రచారంలో భాగంగా గీతాభవన్ సెంటర్‌లో శ్రీరామ పట్టాభిషేకానికి భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈదురు గాలుల ధాటికి 70 అడుగుల ఈ హోర్డింగ్‌ కింద పడింది. కరీంనగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. శంకరపట్నం, రామడుగు, చొప్పదండి, జమ్మికుంట, మానకొండూరు, పెద్దపల్లి ప్రాంతాల్లో అకాల వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈదురు గాలులతో కూడిన వర్షంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.


 


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM