లవంగాలతో కలిగే ప్రయోజనాలివే

byసూర్య | Tue, Jan 11, 2022, 04:06 PM

లవంగాలు వంటకాలకే కాదు, జబ్బుల నివారణకు కూడా బాగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.


-లవంగ మొగ్గ, లవంగ నూనె పంటి సమస్యలకు చక్కటి ఔషధాలుగా పనిచేస్తాయి.


- లవంగాలు తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి.


- లవంగాలు గుండెపోటు రాకుండా నివారించడంలో పరోక్షంగా సహకరిస్తాయి. ఇవి రక్తాన్ని పలుచబరుస్తూ గడ్డ కట్టకుండా నివారిస్తాయి.


- పిప్పి పన్ను నొప్పి పెడుతుందంటే లవంగ మొగ్గను చిదిమి పిప్పి ఉన్న చోట పెట్టాలి. దూదిలో ఒక చుక్క లవంగ నూనెను వేసి, నొప్పి ఉన్న చోట వేస్తే నొప్పి తగ్గుతుంది.


-లవంగ నూనె రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మకణాలను ఉత్తేజపరుస్తుంది.


-లవంగాన్ని మెత్తగా నూరి, మొటిమల మీద రాస్తే, మొటిమ విస్తరించకుండా త్వరగా రాలిపోతుంది. ఇలా రాసేటప్పుడు మొటిమ పక్కన ఉన్న చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి.


-వాంతి అవుతుందనిపించినప్పుడు లవంగం వాసన చూడాలి. లవంగం రసాన్ని చప్పరించినా ఫలితం ఉంటుంది.


-దగ్గు వదలకుండా బాధిస్తుంటే లవంగం మొగ్గను బుగ్గన పెట్టుకుని మెల్లగా నములుతూ రసం మింగాలి.


-లవంగాలు ఇన్‌ఫెక్షన్ల నివారణలో సహకరిస్తాయి. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీవైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీసెప్టిక్‌ గుణాలున్నాయి.


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM