స్మార్ట్ ఫోన్ల వాడకం ... ప్రాణానికి ప్రమాదం తెలుసా ....?

byసూర్య | Thu, Nov 25, 2021, 01:21 PM

ప్రస్తుత తరంలో మొబైల్ ఫోన్స్ వాడకం గురించి ప్రతేకంగా చెప్పాల్సిన పని లేదు . పెరుగుతున్న టెక్నాలజీ వీటిని మనిషికి నిత్యావసర వస్తువుగా చేసింది. దాదాపుగా నూటికి తొంబై మందికి మొబైల్ ఫోన్ ఉంది అంటే నమ్మక తప్పదు . ఒక సర్వే ప్రకారం మొబైల్ వాడకంలో భారతదేశం రెండవ స్థానం లో ఉంది అని చెప్పడం జరిగింది . అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు దీనికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో .
ఐతే , వీటి వలన లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయ్ అంటున్నారు నిపుణులు . వీటి నుండి వెలువడే రేడియేషన్ వలన మనిషి కి త్వరగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అనేది మాత్రం వాస్తవం . ఇప్పటికే , కొన్ని చిన్న జీవరాసులు ఐన  పక్షులు రేడియేషన్ తీవ్రత తట్టుకోలేక చనిపోవడం జరిగింది .
ఐతే , మనిషికి తన వరకు వచ్చే వరకు దీని గురించి ఆలోచించడం లేదు .   రేడియేషన్ వలన మనిషికి కలిగే ప్రమాదాలు ఏమిటో  ఇప్పుడు  చూద్దాం . కొన్ని రకాల గుండె సమస్యలతో బాధపడే వాళ్లకి లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ శరీరంలో అమర్చుతారు. పేస్‌మేకర్స్‌, కార్డియాక్‌ డీఫిబ్రిల్లేటర్స్‌ అమర్చుకున్న వారు స్మార్ట్‌ఫోన్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌తో అయినా లైఫ్‌ సేవింగ్స్‌ ఇంప్లాంట్స్‌కి ఇబ్బందికరమే. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్లలో అయస్కాంతాలుంటాయి. ఇందువల్ల అయస్కాంత క్షేత్ర ప్రభావం దీని మీద పడుతుంది. లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌లో సమస్యలు తలెత్తుతాయి. వాస్తవానికి లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ పని ఏంటంటే.. గుండె తక్కువ లేదా ఎక్కువ సార్లు కొట్టుకుంటే  నియంత్రించే శక్తి వీటికి ఉంటుంది.  స్మార్ట్‌ఫోన్స్‌ లేదా ఎలక్ర్టానిక్‌ వస్తువులను కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. అలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. లైఫ్‌ సేవింగ్‌ ఇంప్లాంట్స్‌ వాడే వాళ్లు స్మార్ట్‌ఫోన్‌ను చొక్కా జేబులో వేసుకోకూడదు. హిప్‌ పాకెట్‌లో మాత్రమే ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు .
రేడియేషన్  వలన శరీరంలోని నరాలు బలహీనపడే అవకాశం ఉంది . దాని వలన శరీరం త్వరగా అలసిపోవడం , లైంగిక వాంఛ తగ్గడం లాంటివి జరుగుతాయి. అలానే , దీని ప్రభావం గుండె , మెదడు మీద ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళల్లో  మొబైల్ ఫోన్స్ ని మంచానికి , తలకి దూరంగా పెట్టడం, అవసరమైన సమయంలో మాత్రమే మొబైల్ వాడకం చెయ్యడం , మొబైల్ ఫోన్ ని మీ నడుము దగ్గర బెల్ట్ సాయంతో  పెట్టుకోవాలి . చొక్కా జేబులో పెట్టుకోవడం వలన గుండె దెబ్బతినే ప్రమాదముంది . అలానే ప్యాంటు జేబులో పెట్టడం వలన లైగిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగర్తలు తీసుకుకుంటూ , వాడటం వలన కొంత మేరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


Latest News
 

గొల్లపల్లిలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 10:42 AM
సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటా: ఎంపీ అభ్యర్థి నీలం మధు Mon, May 06, 2024, 10:37 AM
పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM