ఒత్తిడికి లోనవుతున్న యువత ... కొనితెచ్చుకుంటున్న ఆరోగ్య సమస్యలు

byసూర్య | Thu, Nov 25, 2021, 01:19 PM

పెరుగుతున్న వత్తిడి వలన చాల మంది లో ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతుంది . ఒకప్పుడు వయస్సు మీద పడటం , వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చేవి . కానీ ఇప్పుడు చాల చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రోగాలు రావడం గమనిస్తున్నాం . దీనికి కారణం మన జీవన శైలిలో మార్పు , మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు , మానసిక ఒత్తిడి , చెడు అలవాట్లు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఆహారపు అలవాట్లు : వీటి గురించి చెప్పాలంటే మనం తీసుకొనే ఆహరం ప్రతిదీ రసాయనాల వల్ల , పెర్టిలైజర్ వల్ల పండించేవే . భూమి లోని సారం తక్కువగా ఉన్నపుడు , అధిక దిగుబడి కోసం రైతులు ఈ పద్ధతులు అవలంభించడం జరుగుతుంది . వీటి వలన మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది . అలానే , కొన్ని ఆహారపు పదార్థాలు కుత్రిమముగా తాయారు చెయ్యడం వాటిలో కొన్ని రసాయనాలు కలపడం జరుగుతుంది . ఇప్పుడు యువత ఎక్కువ ఇలా కుత్రిమ ఆహారానికి అలవాటు పడటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతానున్నాయి . కాబట్టి మనం తీసుకొనే ఆహరం పట్ల చాల జాగర్త వహించడం మంచిది .
మానసిక ఒత్తిడి : ప్రధానమైన సమస్య మానసిక ఒత్తిడి . ఎంతో ఆనందంగా గడపవలసిన యవ్వనాన్ని , కొన్ని కుటుంబ  పరిస్థితుల వలన గాని, పేదరికం వలన గాని,  త్వరగా జీవితంలో స్థిర పడాలి అనే భావన వలన గాని ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుంది .  ఉద్యోగం , వ్యాపారం  విషయాలలో ఎక్కువగా ఆలోచించడం , డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వడం ,  రాత్రులు నిద్ర పోకుండా పనిచెయ్యడం వలన ఎక్కువగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది . కాబట్టి జీవితంలో "అన్నిటికన్నా - ఆరోగ్యం మిన్న"  అనే సూత్రాన్ని పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు . గుండె జబ్బులు, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వంటి ప్రధాన జబ్బులు రాకుండా కాపాడుకోవడమనేది ఆ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ కార్యక్రమాలను బట్టే ఇవి ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వల్ల 35 ఏళ్లలోపు యువకులకు కూడా హార్ట్‌ స్ట్రోక్‌లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. డయాబెటిక్‌ బాధితుల సంఖ్య పెరగడానికి కూడా వ్యాయామం లేకపోవడమే కారణమని వెల్లడైంది.
చెడు అలవాట్లు : ధూమపానం, మద్యపానం , పాన్ మసాలా , గంజా , కొకైనే వంటి ప్రాణాంతక వాటిని అలవాట్లగా చేసుకొని వాటికి బానిసలుగా మారి  చేతులారా వీరి జీవితాలను వీరే నాశనం చేసుకుంటున్నారు . వీటి వలన మెదడు మొదలుకొని అరికాలు వరకు శరీరంలోని అన్ని నరాలు బలహీనపడే అవకాశం ఎక్కువ ఉంది . అలానే కాన్సర్ , మూత్రపిండాల వ్యాధులు రావడం , మెదడు పాడైపోవడం లాంటి భయంకర వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం అనేది చాల మంచిది అని వైద్యుల సూచనా . 


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM