కుక్క కరిస్తే ప్రాధమిక చికిత్స ఇలా చెయ్యండి .

byసూర్య | Thu, Nov 25, 2021, 01:23 PM

చిన్న పిల్లలు బడికి వెళ్తున్నపుడు , వస్తున్నపుడు లేదా ఆటలు ఆడుకోవడానికి  బయటికి వెళ్ళినప్పుడు , ఇంట్లో మనం పెంచుకునే కుక్కలా ద్వారా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది . అందులోనూ చిన్న పిల్లల పనులకి కుక్కలు వెంటనే ప్రతిచర్య చేస్తాయి . వీధి కుక్కలకి ఎటువంటి జాగర్తలు తీసుకోరు కాబట్టి అవి చాల విషపూరితంగా గుర్తించాలి . ఇండ్లలో పెంచుకొనే కుక్కలకి తరచు టీకాలు వేయించడం ద్వారా కొంత ప్రమాదం నుండి బయట పడవచ్చు . ఐతే కుక్క కాటు భారిన పడితే తీసుకోవలసిన జాగర్తలు ఏమిటో ఇప్పుడు చూద్దాం .
కుక్క కరచినప్పుడు అయిన గాయాన్ని కొంచెం ఫోర్స్ మీద వచ్చేలా శుభ్రమైన నీటి ప్రవాహం క్రింద కడగాలి. అంటే,మగ్‌తో నీళ్లు పోస్తూ గాని, కుళాయి క్రింద గాయాన్ని ఉంచి నీళ్లు పడుతుండగా సబ్బుతో గాని dettol  వంటి క్రిమి సంహారిక వాటితో కానీ శుభ్రంగా కడగాలి.
కుక్క కరిచినా చోట ప్రాధమిక చికిత్స చెయ్యాలి . అందులో భాగంగా కరిచినా ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి అక్కడ వీలైనంత వరకు రక్తం బయటికి వచ్చేలా వత్తాలి . దాని వలన విషపూరిత రక్తం బాధితుడి శరీరం నుండి బయటికి వస్తుంది. ప్రమాద శాతం తక్కువ అవుతుంది .
గాయం ఐన  ప్రదేశంలో కట్టు కట్టడం లాంటిది చెయ్యకూడదు . గాయానికి గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలి .
కుక్క కాటు వలన రేబీస్ వ్యాధి వస్తుంది.  కాబట్టి  రేబీస్‌ వ్యాధి  వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి తక్షణం డాక్టర్‌ను సంప్రదించి యాంటీరేబీస్‌ వ్యాక్సిన్‌ను తగిన మోతాదుల్లో ఇప్పించాలి.
 గాయం తీవ్రతను బట్టి ఇమ్యునోగ్లోబులిన్‌ ఇంజెక్షన్స్‌ను గాయం అయిన చోట మరియు చేతికి వైద్యుడి సలహా మేరకు తీసుకోవలసి ఉంటుంది.
గాయం అయిన  చేతికి ఇమ్యునో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి,  ఆ రెండో వైపు చేతికి యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వడం జరుగుతుంది .
కుక్క కాటు అనేది అప్పటికి ప్రాణాంతకం కాదులే అని అశ్రద్ధ చెయ్యడం వలన వేరే వ్యాధులు సోకి అది తీవ్ర రూపం దాల్చుతుంది .
అలానే, కుక్క కాటుకి గురి ఐన  వారు కొన్ని ఆహారపు నియమాలు పాటించాల్సి వస్తుంది . వైద్యుడిని సంప్రదించిన తర్వాత వీటి గురించి తాను చెప్పిన విధంగా నడుచుకోవడం మంచిది.  


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM