సహజ పద్దతిలో కవలలు పుట్టడానికి పాటించాల్సిన నియమాలు

byసూర్య | Wed, Nov 24, 2021, 01:34 PM

కొత్తగా పెళ్లిచేసుకొని లేదా లివింగ్ రిలేషన్షిప్  పెట్టుకున్నవారిలో పిల్లల గురించి ఆందోళన మరియు తత్తరపాటు ఉంటుంది . ఐతే కొంత మందికి త్వరగా పిల్లలు పుడతారు కొంతమందికి కొంత ఆలస్యం అవుతుంది మరికొంతమందికి పాపం అసలు పిల్లలే కలగరు . ఎలా ఆలస్యం ఐన  వారు లేదా పిల్లలు లేని వారు వైద్యుడిని  సంప్రదించి తగిన మందులు వాడటం వలన  మంచి ఫలితాలు పొందవచ్చు .
ఐతే , పిల్లలు పుట్టిన వారిలో కూడా కొంతమందికి కవలలు పుట్టడం మనం గమనిస్తూనే ఉంటాం . ఏది కొంత మందికి ఆర్చర్యకరంగాను , వింతగానూ,ఆనందంగానూ ఉంటుంది.కవల పిల్లలు  పుట్టుక నుండే కొన్ని దగ్గరి పోలికలను కలిగి ఉంటారు అందువల్ల చాలామంది కవలలను కోరుకుంటారు. వారు ఇద్దరు అబ్బాయిలు కావచ్చు లేదా ఒక అబ్బాయి, అమ్మాయి కావచ్చు. నిజానికి, సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. అసలు ఎలా కావాలా పిల్లలు పుట్టడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం .
 ఒక ఫలదీకరణం చెందిన గుడ్డు(అండం ) రెండుగా విడిపోవడం వల్ల ఒకేపోలికతో కూడిన కవలలు పుడతారు, రెండు రకాల పిల్లలుగా ఎదుగుతారు. ద్వంద్వ కవలలు చాలా సాధారణం, రెండు వేరు వేరు ఎగ్స్ (అండాలు )ఫలదీకరణం చెందడం వల్ల అభివృద్ది చెంది ఇద్దరు పిల్లలుగా పుడతారు. ఒక స్త్రీ కవలలను గర్భం దాల్చే సామర్ధ్యాన్ని కలిగి ఉండడంలో జన్యువులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.
సహజంగా కవలలను పొందడానికి చిట్కాలతో పాటు, మీ కుటుంబంలో ఎంతమంది కవలలు ఉన్నారు, మీ వయసు, ఇంతకు ముందు పిల్లలు వంటి సాధారణ అవకాశాలను కూడా పరీక్షించుకోవాలి.  సహజంగా కవలలను గర్భం దాల్చాలంటే ఎక్కువ మోతాదులో విటమిన్లను తీసుకోవడం ఒక చిట్కా. గర్భవతికి అవసరాలకు సరిపోయే విధంగా తయారుచేసిన ఈ నెలలోపు తీసుకునే విటమిన్లు చాలా మంచివి.  సమతుల్య ఆహరం అనేది సహజంగా కవలలను పొందడానికి మంచి ప్రాధాన్యతను కలిగి ఉంది.  మీరు కవలల కోసం ప్రయత్నించే ముందు సరైన బరువు పొందదానికి వైద్యుడిని సంప్రదించండి.  పాలు ,  వెన్న, చీజ్, ఇతర పాల పదార్ధాలను మీ ఆహారంలో తీసుకోవడం వల్ల కవలల గర్భధారణ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  పాల పదార్ధాలలో  ఇన్సులిన్ ఉండడం వలన  వాటిని తీసుకుంటే సహజంగా కవలలను గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అలానే దుంప కూరలు ఎక్కువగా తీసుకునే వారిలో కూడా కవలలు కలగడానికి అవకాశం ఉంది . చాలామంది కుటుంబ నియంత్రణకు అనేక రకాల మందులు వాడుతుంటారు. మీరు గర్భధారణను పొందాలి, పిల్లలు కావాలి అనుకుంటే ముందే అటువంటి మందులను మానేయండి. మీరు సహజంగా కవలలను గర్భం దాల్చడానికి మీ వైద్యుని  సంప్రదించండి. ఆయన ఒక సాధారణ గర్భందాల్చే స్త్రీకి కూడా కవలలను పొందే అవకాశాలు పెంపొందించే కొన్ని మందులను ఇస్తారు.
సహజంగా కవలలను గర్భం దాల్చడానికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. పూర్వం, ఈ విధానాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీలు అని పిలిచేవారు, ఇక్కడ ఫలదీకరణం చెందిన రెండు గుడ్లను మీ గర్భంలో పంపిస్తారు. సహజ కవలల గర్భధారణకు స్త్రీలకూ వైద్యం చాలా అవసరం.
పురుషుల్లో లోపం విషయానికి వస్తే... వారిలో వీర్యకణాల సంఖ్య సరిపోను ఉండాలి. అంతేకాకుండా వాటి క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఒక్క స్ఖలనంలో కనీసం 20 మిలియన్ల వీర్యకణాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పురుషుడిలో కూడా ఆరోగ్యకరమైన వీర్యకణాలు పెంచగల సామర్ధ్యం ఉండాలి . 


Latest News
 

నేడు సత్తుపల్లిలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి Sun, Apr 28, 2024, 09:55 AM
మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా Sat, Apr 27, 2024, 09:30 PM
మంచి వ్యక్తిని గెలిపించండి.. తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఏపీ టీడీపీ నేత ప్రచారం Sat, Apr 27, 2024, 09:22 PM
బంగారంలా మెరిసిపోతున్న స్మితా సబర్వాల్.. మేడం సర్ మేడం అంతే Sat, Apr 27, 2024, 09:20 PM
ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM