అందమైన చేతి వేళ్ళ కోసం మెనీక్యూర్‌ పద్దతి చాల మేలు

byసూర్య | Wed, Nov 24, 2021, 01:38 PM

ఎదుటివారితో  కరచాలనం చేస్తున్నప్పుడు , ఏదైనా ఒక పని నలుగురిలో చేసే టప్పుడు , ఆడవారు చీరలు కట్టుకున్నప్పుడు , మన చేతులు వాటి పరిస్థితి అందరికి కనిపిస్తుంది . ఇలాంటి సమయంలో మన ముఖం ఎంత కాంతివంతంగా ఉన్న చేతులు వాటికి ఉన్న వేళ్ళు , గోళ్లు అందంగా లేకుంటే మన మీద బాడ్ ఇంప్రెషన్ పడటం సహజం . అలాంటి పరిస్థితి నుండి బయట పడటానికి,  మీ చేతులు అందంగా మలుచుకోవడానికి ఉపయోగించే పద్ధతినే   మెనీక్యూర్‌ అంటారు .
 ఇది చేతులు, చేతివేళ్లు, గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతి  . మెనీక్యూర్‌ అనేది ఒక లాటిన్‌ పదము . మానస్‌ అంటే చేయి, క్యూర్‌ అంటే తగ్గించడం , బాగుచెయ్యడం లాంటి అర్ధాలు వస్తుంటాయి .  ఈ పద్దతి ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం .
ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్‌ పెయింట్‌ను తుడిచివేస్తారు. తర్వాతా గోళ్లను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి ట్రిమ్‌ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్‌ చేశాక, ఒక గిన్నెలో సబ్బు నీళ్లను  తీసుకుని అందులో హైడ్రోజన్‌  పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి 10 నిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి గరుకుగా ఉంటే క్యూటికల్స్‌ మెత్తగా అవుతాయి. గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. తరువాత అరిచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్‌  చేస్తారు.
ఆపై రెండు చేతులను తడిలేకుండా టవల్‌తో తుడుస్తారు. క్యూటికల్‌ రిమూవర్‌తో గోళ్ళ చుట్టూ ఇంకా ఏమైనా క్యూటికల్‌ బిట్స్‌ ఉంటే తీస్తారు. దీనివల్ల గోరు పెద్దదిగాను అందంగాను కనిపిస్తుంది. తరువాత చేతులను శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్‌తో చేతులకు, వేళ్లకు మర్థన చేస్తారు. ఇలా నెలకు రెండు సార్లు  చేయడం వలన చేతులు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాస్త ధరను భరించగలిగినవారైతే నిపుణులతో మెనీక్యూర్‌ చేయించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
లేదా ఈ పద్దతిలో వాడే పరికరాలు మీకు అందుబాటులో ఉన్నట్లయితే , ఇంటి దగ్గర కూడా స్వయంగా  చేసుకోవచ్చు .  ఇవి చెయ్యడం వలన గోళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి  అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు కూడా పుష్కలంగా పోషకాలు అందడంవల్ల పెరుగుదల మంచిగా ఉండి మరింత కాంతివంతంగా మెరుస్తాయి. చేతుల మీద చర్మం ముడతలు రాకుండా మృదువుగా , కాంతివంతంగా తయారవుతుంది . 


Latest News
 

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ కీలక సూచన.. పోలింగ్‌ రోజు ఆగమాగమే Sat, May 11, 2024, 11:58 PM
సీఎం ఆఫీసులో పెత్తనమంతా ఆయనదే.. నేను ఉత్త రబ్బర్ స్టాంపునే: రేవంత్ రెడ్డి Sat, May 11, 2024, 11:56 PM
సికింద్రాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కే సొంతం Sat, May 11, 2024, 09:49 PM
బీజేపీకి మద్దతు తెలిపిన అగర్వాల్ సమాజ్ Sat, May 11, 2024, 09:47 PM
లోక్ సభ ఎన్నికల బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించాలి Sat, May 11, 2024, 09:46 PM