పెను కొరుకుడు కి విరుగుడు .... మందారం . తెలుసా.... ?

byసూర్య | Fri, Nov 19, 2021, 01:25 PM

పేను  కొరుకుడు అంటే కొంతమందికి తెలుసో లేదో  కానీ ఇది  సాధారణంగా చాల మంది లో  జరుగుతుంది . దీనికి  భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇది  అంటు వ్యాధి కాదు అలానే ప్రమాదకరమైనది కూడా కాదు .  అసలు దీనిని  ఎలా గుర్తించాలి అంటే . .. జుట్టు ఒకేచోట ఊడిపోయి గుండ్రంగా చర్మం కనపడుతుంది .
పేను కొరుకుడు సమస్య  శాస్త్రీయ నామం  అలోపేషియా ఏరియేటా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు గుండ్రగా  ప్యాచెస్‌గా రాలిపోతూ ఉంటుంది. అంటే జుట్టు రాలిపోయిన చోట  గుండ్రంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది . కొన్నిసార్లు రాలిన చోట జుట్టు దానంతట అదే వస్తుంది కూడా. ఈ జుట్టురాలిన  ప్యాచెస్‌ ఎన్ని ఉన్నాయనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే... ప్యాచెస్‌ పరిమాణం , సంఖ్య తక్కువైతే కేవలం టాపికల్‌ ట్రీట్‌మెంట్‌ సరిపోతాయి.  దానికితోడు వెంట్రుకలు రాలిపోయిన ఆ ప్యాచెస్‌లో ఒక్కోసారి ఇంట్రా లీజనల్‌ స్టెరాయిడ్స్‌ అనే ఇంజెక్షన్స్‌ కూడా ఇవ్వాల్సి వస్తుంది .
అదే ప్యాచెస్‌ సంఖ్య ఎక్కువైతే నోటి ద్వారా మందులు  తీసుకుంటే సరిపోతుంది . అలొపేషియా ఏరియేటా సమస్య  ఉంటే  చికిత్స తప్పక తీసుకోవాలి. లేకపోతే ఒక్కోసారి జుట్టుమెుత్తం రాలిపోయే ప్రమాదం  ఉంది. దీన్నే వైద్య పరిభాషలో అలొపేషియా టోటాలిస్‌ అంటారు. ఆ పరిస్థితి రాకముందే చికిత్స తీసుకోవడం మంచిది. దీని వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు కాబట్టి భయపడాల్సిన పని లేదు కానీ చూడటానికి కొంచెం అసయ్యంగా  ఉంటుంది . దాని వలన నలుగురిలో ఎక్కువగా గడపలేము అలానే కొంత మానసిక చింతకి గురి అవ్వడం జరుగుతుంది .
దీనికి , మనం ఇంటి దగ్గర కూడా చికిత్స చేసుకోవచ్చు . ఒంటి రెక్క మందారం గురించి మీరు వినే  ఉంటారు. ఈ ఒంటి రెక్క మందారపు పువ్వులను తీసుకొని వాటిని మనకు ఎక్కడ ఈ సమస్య ఉందొ ఆ ప్రదేశంలో రుద్దటం చెయ్యాలి , దీని  వలన ఆ పువ్వులోని రసం మొత్తం మన చర్మం లోకి ఇంకిపోతుంది. ఇలా  ఒక పది రోజులు చెయ్యడం వలన ఈ సమస్య నుండి బయట పడవచ్చు . ఒకవేళ మందారం పువ్వులు దొరకని వారు , బయట మార్కెట్లో మందారపు తైలం అమ్మకానికి దొరుకుతుంది . దానిని తెచ్చుకొని ఈ సమస్య యున్న చోట రోజు ఒక ఐదు నిముషాలు మర్దన చెయ్యడం ద్వారా కూడా ఈ సమస్య నుండి బయట పడవచ్చు .    


Latest News
 

ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు Sat, May 04, 2024, 01:46 PM
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ Sat, May 04, 2024, 01:45 PM
నామా పర్యటనను విజయవంతం చేయండి: జడ్పీ చైర్మన్ Sat, May 04, 2024, 12:17 PM
ఆత్మకూర్ లో అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం Sat, May 04, 2024, 12:08 PM
బీఅర్ఎస్ నుండి కాంగ్రెసులో చేరికలు Sat, May 04, 2024, 11:46 AM