పసి బిడ్డకు  పాలు పట్టించేటప్పుడు  తీసుకోవలసిన జాగర్తలు

byసూర్య | Fri, Nov 19, 2021, 01:28 PM

బిడ్డ పుట్టినప్పుడు తల్లితండ్రులకు ఎంత సంతోషం వేస్తుందో చెప్పలేము . అది ఒక మరపురాని ఘటన . కొత్తగా పెళ్లైన జంటకి దేవుడు ఇచ్చిన వరం గా భావిస్తారు . కానీ కొంత మందికి బిడ్డని ఎలా పెంచాలో , ఎటువంటి జాగర్తలు తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు . మరి ముఖ్యంగా బిడ్డకు పాలు పట్టే సందర్భం . ఏది ప్రతి తల్లికి ఒక మధురానుభూతి . కానీ కొంత మందికి కొన్ని లోపాల వలన పాలు పడకపోవడం జరుగుతుంది . ఇలాంటి సందర్భాలలో బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లి లేక సంరక్షకులు  డబ్బా పాలు పట్టడం అలవాటు చేస్తారు .
ఈ డబ్బా పాలు వలన ఉన్న కొన్ని జాగర్తలు  తెలుసుకుందాం .
ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు  బిడ్డకి బలాన్ని చేరుస్తాయి  అలానే ఆరోగ్యం కూడా . అవి దొరకని సమయంలో చాల మంది పాల పొడిని కొని వాటి ద్వారా పాలను తయారుచేసుకొని ఇవ్వడం జరుగుతుంది . ఐతే ఎలా పాల పొడి ద్వారా తయారయ్యే పాల విషయంలో చాల జాగర్త అవసరం . ఆ పొడి ప్యాకెట్ తయారీ తేదీ , ముగింపు తేదీ తప్పని సరిగా చూసుకోవాలి అలానే ఆ పొడి తాయారు చేసే పరిశ్రమ మంచిదా కాదా అని ఆరా తీయాలి . లేకుంటే ఆ పాల వలన బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది .  
ఇక పోతే , పాలు పట్టే  సీసా విషయంలో కూడా చాల జాగర్త వహించాలి .. తక్కువ రేటుకే వస్తుంది కధ అని నాసిరకమైన వాటిని కొనకండి అవి కొంచెం వీడి తగిలిన కానీ వాటిలోని ప్లాస్టిక్ కరిగి పట్టే  పాలలో కలిసే అవకాశం ఉంది .
పాలు పట్టే  ప్రతి సారి సీసాను మరియు పాల పీకను  శుభ్రంగా వేడి నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత దానిని శుభ్రపరచాలి . అలానే బిడ్డకు పాలు పెట్టె విధానం కూడా సరిగ్గా  చూసుకోవాలి . బిడ్డ తల భాగం కొంచెం ఎత్తుగా ఉండి  కాళ్ళ భాగం కొంచెం కిందకు ఉండేలా చూసుకోవాలి అప్పుడు బిడ్డకి పాలు తాగడం సులభమవుతుంది .  బిడ్డ నిద్ర వేళల్లో , గుక్క పట్టి ఏడ్చే వేళలో పాలుపాటించకూడదు . కొంత మంది ఏడిస్తే పాలు పట్టించు అంటారు అది సరిఐనదే కానీ , ఆ ఏడుపు  ఎక్కువగా ఉన్నపుడు పట్టకూడదు . దీని వలన బిడ్డకు పోరా పొయ్యే అవకాశము ఉంది .    
బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. అలాగే పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు. పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి.సీసాలో పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను మళ్ళి పడదాంలే అని ఉంచుకోకూడదు వాటిని పడేసి , డబ్బా శుభ్రంగా బ్రెష్ తో కడగాలి . ఏది  ఏమైనా బిడ్డ 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM