హైదరాబాద్ వాసులకు అలెర్ట్..మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

byసూర్య | Wed, Oct 27, 2021, 08:08 AM

తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మ‌హాన‌గ‌రానికి మంచినీటి స‌ర‌ఫ‌రా చేస్తున్న మంజీరా డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై స్కీం (ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ -2లో క‌లాబ్‌గూర్ నుంచి ప‌టాన్‌చెరు వ‌ర‌కు ఉన్న 1500 ఎంఎం డ‌యా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివార‌ణ‌కు మరమ్మతులు, కంది గ్రామం వ‌ద్ద జంక్షన్ ప‌నులు చేపట్టనుంది. ఆ కారణంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. శుక్రవారం ఉద‌యం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా 30వ తేది శ‌నివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ 36 గంటలపాటు మంజీరా డ్రింకింగ్‌ వాట‌ర్ స‌ప్లై స్కీం(ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌) ఫేజ్ -2 ప‌రిధిలోకి వ‌చ్చే ప‌టాన్‌చెరు నుంచి హైద‌ర్‌న‌గ‌ర్ వ‌ర‌కు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.


అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే:


ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 9: హైద‌ర్‌న‌గ‌ర్‌, రాం న‌రేష్‌న‌గ‌ర్‌, కేపీహెచ్‌బీ, భాగ్యన‌గ‌ర్‌, వ‌సంత్ న‌గ‌ర్‌, ఎస్‌పీన‌గ‌ర్,


ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 15: మియాపూర్‌, దీప్తిన‌గ‌ర్‌, శ్రీన‌గ‌ర్‌, మాతృశ్రీన‌గ‌ర్‌, ల‌క్ష్మీన‌గ‌ర్‌, జేపీ న‌గ‌ర్‌, చందాన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాలు.


ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 23: నిజాంపేట్‌, బాచుప‌ల్లి, మ‌ల్లంపేట‌, ప్రగ‌తిన‌గ‌ర్‌.


ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 32: బొల్లారం ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదారాబాద్ జలమండలి అధికారులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM