టమాటాతో 10 ఆరోగ్య ప్రయోజనాలు

byసూర్య | Wed, Oct 27, 2021, 08:07 AM

టమాటా లేని కూర వండడం అసాధ్యం. ఏ కూరైనా సరే ఒక్క టమాటైనా వేస్తారు. అసలు టమాటా లేకుంటే కూరలే లేవంటే నమ్మండి. టమాటాలల్లో ఎన్నో యాంటీబయాటిక్స్, విటమిన్స్ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 3వేల రకాల టమాటాలున్నాయి. టమాటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.


టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది.


రక్తం గడ్డ కడితే మంచిదే. అతిగా గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగితే, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే టమాటాలు తినాలి.


బీపీని తగ్గించే లక్షణాలు టమాటాలకు ఉన్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు టమాటాలు తింటే మంచిది.


టమాటాలు మన శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ని మెయింటేన్ చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎన్ని టమాటాలు తింటే అంత మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటాలు తినాలి. వాటిలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.


టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్... కళ్లకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.


చర్మం కోమలంగా ఉండాలంటే టమాటాలు తినాలి. వాటిలోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేస్తాయి. ముసలితనం రాకుండా కాపాడతాయి.


ఎముకలు బలంగా, ధృడంగా ఉండాలంటే టమాటాలు తీసుకోవాలి. వాటిలోని మెగ్నీషియం ఎముకలకు మేలు చేస్తుంది.


ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని టమాటాలు తింటే అంత మంచిది. పుట్టే పిల్లలు అత్యంత ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా పుడతారు.


శరీరంలో రక్తం సరిగా లేనివారూ, అనీమియా (రక్త హీనత)తో బాధపడేవారు టమాటాలు తింటే, వాటిలోని సీ విటమిన్... ఐరన్ పెరిగేందుకు దోహదపడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ... రోజూ రెండు టమాటాలైనా తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


Latest News
 

మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు Wed, May 08, 2024, 04:20 PM
వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 04:17 PM
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన Wed, May 08, 2024, 04:14 PM
బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Wed, May 08, 2024, 04:11 PM
రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి పొందాలి: జిల్లా కలెక్టర్ Wed, May 08, 2024, 04:09 PM