పెళ్ళి వేడుకల్లో అందంగా కనిపించాలా ? ఏ పదార్థాలు తీసుకోవాలి ? వేటికి దూరంగా ఉండాలి ?..పూర్తి వివరాలు

byసూర్య | Tue, Oct 26, 2021, 03:30 PM

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. పండుగల సీజన్ సందర్భంగా ఈ ఆసక్తి మరింత పెరుగుతుంది. అయితే శరీరంలో వస్తున్న మార్పులను చర్మం ప్రతిబింబిస్తుంది. కొందరు చర్మ సౌందర్యం  మెరుగు పరుచుకోవడం కోసం కొన్ని ఉత్పత్తులు వాడుతారు. దీనికి తోడు తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఫెస్టివ్ సీజన్‌లో చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడం కోసం పాటించాల్సిన ఆహార (Food) యమాలు పరిశీలిద్దాం.


సమతులాహారం తీసుకోవడం, మంచి నిద్ర (Sleep) , ఒత్తిడికి గురికాకుండా ఉండటం, హైడ్రేషన్ లెవల్స్ ఇవన్నీ స్కిన్ క్వాలిటీని నిర్ణయిస్తాయి. తీసుకునే ఆహారంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ ఉండేలా చూసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది.


* ఒమెగా 3 ఆహారం తీసుకోవాలి


కాలుష్యం, పొగ, యూవీ రేడియేషన్ల నుంచి కలిగే దుష్ఫలితాలు తగ్గించేందుకు తీసుకునే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. దీని వల్ల చర్మం ముడతలు పడకుండా పొడి చర్మం మెరుగుపడుతుంది. ఫ్యాటీ ఫిష్, సబ్జా గింజలు, అవిసె గింజలు, వాల్ నట్స్, అవిసె గింజల నూనెలో ఓమెగా 3 పుష్కలంగా లభిస్తుంది.


* విటమిన్ ఈ లభించే ఆహారం తప్పనిసరి


యూవీ రేడియేషన్ల నుంచి విటమిన్ ఈ రక్షిస్తుంది. ఉసిరి, ఆల్మండ్, అవకాడో, హాజల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.


* విటమిన్ ఎ


చర్మం మృదువుగా మారడానికి విటమిన్ ఎ ఉపయోగపడుతుంది. చర్మ సంరక్షణ వ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. యానిమల్ ప్రొటీన్, స్వీట్ పొటాటో, ఉడికించిన పాలకూర, క్యారెట్ లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.


* ఇవి తప్పనిసరి


యోగర్ట్, తెల్ల నువ్వులు, కంబూచా, పికెల్డ్ ఫుడ్స్, కుంకుమపువ్వు లు అవసరమైన మేర తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయి. దీని ద్వారా చర్మం కూడా మృదువుగా మారుతుంది.


* పసుపుతో చర్మసౌందర్యం


మన పూర్వీకుల నుంచి సాంప్రదాయంగా వస్తున్న పసుపు కూడా చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. నల్ల మిరియాలు, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పసుపులో అదనంగా కలుపుకోవడం ద్వారా మరింత ప్రయోజనం కలుగుతుంది.


* ఇవి తినొద్దు


మద్యం, బాగా వేయించిన ఆహారం, రిఫైన్డ్ షుగర్ ఉండే పదార్థాలు తీసుకోరాదు. డీహైడ్రేషన్‌కు గురికావద్దు. పొగతాగడం మానేయాలి. సరైన సమయానికి నిద్ర పోవాలి. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు మన శరీరం స్పందిస్తే చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM
రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Wed, May 08, 2024, 08:56 PM