తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్

byసూర్య | Tue, Oct 26, 2021, 09:51 AM

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నిజామాబాద్ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరుడు ఉప్పు సంతోష్.. తనను డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ కల్లు వ్యాపారి ఇచ్చిన పిర్యాదుతో నిజామాబాద్ పోలీసులు ఈ నెల 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పు సంతోష్‌ ఏ1, మల్లన్నను ఏ2గా చేర్చారు. పోలీసులు.. సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.ఆ సమయంలో మల్లన్న చంచల్‌గూడ జైలుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దాంతో నిజామాబాద్ పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిలో మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లి నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM