సంగారెడ్డిలో నూతన పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభం

byసూర్య | Sat, Jun 12, 2021, 12:33 PM

సంగారెడ్డి: పట్టణంలో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభమైంది. శనివారం ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్‌కు ప్రజలు రావాలంటే భయపడే స్థితి నుండి ఫ్రెండ్లి పోలీస్ వ్యవస్థ వరకు ఏర్పాటు చేసామన్నారు. ఏదైనా సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో పోలీసులు బాధితులకు సహాయం అందించేందుకు 100ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పోలీసుల కోసం అధునాతన వాహనాలను, సాంకేతికతను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారని చెప్పారు. పోలీస్ శాఖ బలోపేతానికి రూ.1000 కోట్లు నిధులను కేసీఆర్ మంజూరు చేశారన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా షీ టీం ఏర్పాటు చేసింది మన రాష్ట్రమే అని చెప్పుకొచ్చారు. దేశంలోనే పోలీసింగ్ వ్యవస్థలో తెలంగాణ రాష్టం మొదటి స్థానంలో ఉందన్నారు. నేరాల నియంత్రణకు ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిందని... దేశం మొత్తంలో ఉన్న సీసీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణాలోనే ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM