నకిలీ విత్తనాలు విక్రయిసస్తే కఠిన చర్యలు: రాచకొండ సీపీ

byసూర్య | Sat, Jun 12, 2021, 12:21 PM

నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న షాపులు గోదాములపై సోదాలు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. హయత్ నగర్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాల షాపులపై దాడులు చేశామని... హయత్‌నగర్‌లోని పసుమాముల గ్రామంలో నకిలీ విత్తనాలు 60 లక్షల సీజ్ చేశామనిచెప్పారు. పత్తి, మిర్చి, వేరుశెనగ ఏక్స్పెర్ డేట్ ముగిసినా విత్తనాలు విక్రయిస్తున్నారని తెలిపారు. గారినేని పాని గోపాల్ యజమానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని సీపీ చెప్పారు. మునుగునూర్‌లో గోపాల్ సీడ్స్ బిజినెస్ ఉందని తెలిపారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలు విక్రయిసస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత నాలుగు సంవత్సరాలుగా 10 మందిపై పిడి యాక్ట్ నమోదు చేశామన్నారు. ఎస్వోటి టీమ్‌తో పాటు అగ్రీకల్చరల్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించామని చెప్పారు. గోపాల్‌పై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM