మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

byసూర్య | Fri, Jun 11, 2021, 11:00 AM

దేశంలో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర అక్షరాలా 102 రూపాయల మార్క్ ను దాటింది. ముంబై లో లీటర్ పెట్రోల్ 102 రూపాయల 04 పైసల వద్దకు చేరగా డీజిల్ ధర 94 రూపాయల 15 పైసలుగా నమోదయింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 95 రూపాయల 85 పైసలుగా వుండగా డీజిల్ ధర 86 రూపాయల 75 పైసలు వద్దకి చేరింది.


ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 99.62 వద్దకు చేరగా, డీజిల్ ధర లీటర్ కు 94.57 వద్ద కొనసాగుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో మే 4 నుంచి జూన్‌ 11 వరకు 23 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM