రూల్స్ బ్రేక్ చేస్తూ బర్త్ డే పార్టీ..

byసూర్య | Fri, Jun 11, 2021, 10:41 AM

కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరికలుు జారీ చేస్తూనే ఉన్నాయి. కానీ కొంతమంది అవేమీ పట్టన్నట్లు ఇష్టానుసారంగా పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలను ఏమాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతూ, వేడుకలు చేస్తున్నారు.


హైదరాబాద్ మహానగరంలోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం అర్ధరాత్రి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది యువకులు పార్టీ చేసుకున్నారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హాబీబ్ నగర్ పోలీసులు అర్జున్ అనే వ్యక్తితో పాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


హబీబ్ నగర్ ప్రాంతానికి చెందిన అర్జున్ అనే యువకుడు లాక్ డౌన్ నిబంధనలు ఎమాత్రం లెక్కచేయకుండా అర్థరాత్రి సమయంలో బర్త్ డే పార్టీ హంగామాగా జరిగింది. 50 మందికి పైగా ఒకే చోట చేరి పార్టీ చేసుకుంటూ, తల్వార్లతో డాన్స్‌లు చేస్తూ ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. అలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి తల్వార్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM