లాభాల్లో సూచీలు

byసూర్య | Fri, Jun 11, 2021, 09:52 AM

 అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, రుతుపవనాల ఆగమనం వంటి సానుకూల పరిణామాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 227 పాయింట్ల లాభంతో 52,527 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 75 పాయింట్లు ఎగబాకి 15,813 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.94 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.


సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, టెక్‌మహీంద్రా షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM