చెల్లెలిపై అసభ్యకరంగ ప్రవర్తించిన అన్నను రోకలిబండతో కొట్టి చంపిన ఘటన

byసూర్య | Fri, Jun 11, 2021, 11:20 AM

ఓ వైపు మహిళలపై జరిగే అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే..మరోవైపు ఆ అత్యచారాలు తనమన అనే భేదం లేకుండా తయారయ్యాయి..మహిళలపై హత్యలు అత్యాచారాలు చేయడమే మహా నేరంగా పరిగణిస్తుంటే...ఇప్పుడు అవి స్వంత ఇంటికే చేరుతున్నాయి..దీంతో తల్లి , చెల్లి అనే భేదం లేకుండా కీచకలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు...దుర్మార్గులు మద్యం మత్తులో ఎలాంటీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో అర్థం కాని స్థిని నెలకొంది. 


తాజాగా ఓ చెల్లెలిని మద్యం మత్తులో లైంగికవేధింపులు చేస్తున్న అన్నను రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో చెల్లెలిపై అసభ్యకరంగ ప్రవర్తించిన అన్నను రోకలిబండతో తలపై మోది చంపిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది . స్థానికులు , టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసముంటున్న సతీష్ ( 35 ) గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి చెల్లెలితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది...అన్న నుండి తప్పించుకునేందుకు ఇంట్లో ఉన్న రోకలి బండనే ఆయుధంగా చేసుకుంది..దీంతో దుర్మార్గంగా వేధిస్తున్న అన్నను రోకలిబండతో తలపై గట్టిగా కొట్టింది..అయితే మద్యం మత్తులో సతీష్ ఉండడంతో తల నుండి రక్తం కారి అక్కడికక్కడే మృతిచెందిడు.


ఈ క్రమంలోనే స్థానికుల ద్వార సమాచారo అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు . అర్థరాత్రి వరకు విచారణ కొనసాగించారు.. సంఘటనకు దారి తీసిన అంశాలపై పోలీసులు తమ స్టైల్లో ఆరా తీశారు. సంఘటన జరిగినప్పుడు ఇంట్లో సతీష్ తల్లిదండ్రులు కూడా ఉండడంతో వారి నుండి వివరాలు సేకరించారు. అయితే తనను ప్రతి రోజు తాగి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతూ, లైంగిక వేధిస్తున్నాడని ,చేసేది ఏమి లేక నన్ను నేను కాపాడుకోవడానికి రోకలి బండతో కొట్టడంతో చనిపోయాడని వివరించింది..పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM