బ్లాక్ లో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అమ్ముతున్న మెడికల్ రిప్రజెంటేటీవ్ అరెస్ట్‌

byసూర్య | Tue, Jun 08, 2021, 04:19 PM

రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని నగరంలోని హుస్సేనీఆలంలో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కిషన్‌బాగ్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటీవ్‌ మెహ్మద్ షఫీయుద్దీన్‌ "38 "గా గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షఫీయుద్దీన్ ప్రైవేటు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. తక్కువ ధరకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కొనుగోలు చేసి ఒక్కొటి రూ. 10 వేల నుండి రూ.15 వేల వరకు అమ్ముతున్నాడు. నిందితుడి వద్ద నుండి 20 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజక్షన్లను, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం హుస్సేనీఆలం పోలీసులకు అప్పగించారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM
రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన Wed, May 08, 2024, 08:56 PM