చేతి వాటం ప్రదర్శిస్తున్నపెట్రోల్ బంకులు.. ధన్వాడ బంకు సీజ్

byసూర్య | Tue, Jun 08, 2021, 03:50 PM

వినియోగదారులకు పోసే పెట్రోల్, డీజిల్ లో చేతి వాటం ప్రదర్శించే పెట్రోల్ బంక్ ల పై చర్యలుతప్పవని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. అలాంటి బంక్ లు బంద్ కావడం ఖాయం అని నారాయణ పేట జిల్లా పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.మంగళ వారం నాడు ధన్వాడ లో ఉన్న భారత పెట్రోలియం బంకు పై నిర్ణీత పరిమాణం కన్న తక్కువ ఇంధనం లభ్యత ఆన్న ఆరోపణలు రావడం తో బంక్ ను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు మాచన రఘునందన్ తెలిపారు.


కొందరు రైతులు ట్రాక్టర్ ల కోసం డీజిల్ ను వాహనాల్లో కాకుండా డబ్బాల్లో పట్టుకెళ్ళారనీ, తొందరలో పరిమాణం పట్టించుకోకుండా వెళ్తున్నారని భావించిన బంకు నిర్వాహకులు ఇదే అదను గా భావించి, చేతి వాటం కు ప్రయత్నిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు రఘునందన్ వివరించారు.బంకు యజమానులు అంతగా పట్టించు కొక పోవడం, సేల్స్ బాయ్స్ అతి తెలివి ప్రదర్శించడం వెరసి వినియోగ దారులకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయని రఘునందన్ పేర్కొన్నారు. తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ లో బుధవారం నాడు సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేలాక బంకు ను యధా విధిగా నడిపెలా అనుమతి ఇవ్వడం జరుగుతుందని రఘునందన్ స్పష్టం చేశారు.


Latest News
 

నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM
ఎన్నికల్లో బిజెపిని ఓడించాలి Sat, Apr 20, 2024, 01:04 PM