జూన్ 8న తెలంగాణ కేబినెట్ భేటీ..లాక్‌డౌన్ గురించి చర్చా

byసూర్య | Sun, Jun 06, 2021, 01:08 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయ పనులు, లాక్‌డౌన్ గురించి చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్ చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర అంశాల మీద సమీక్ష జరగనుంది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయంపై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత, తగు ఏర్పాట్లపై కేబినెట్ కీలకంగా చర్చించనుంది. కరోనా కట్టడికోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


ఇక ఈ నెల 7 నుంచి 19 జిల్లాల్లో 19 డయాగ్నటిక్ సెంటర్లను ప్రారంభించాలని తలపెట్టిన కార్యక్రమాన్ని జూన్ 9కి వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయంపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM